News August 18, 2024

KNL: త్వరలో భారీగా పోలీసుల బదిలీ?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో త్వరలో భారీగా ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. తాజాగా కర్నూలు రేంజ్ పరిధిలో పెద్ద సంఖ్యలో CIలను బదిలీ చేస్తూ DIG ఉత్తర్వులు జారీ చేయగా, SIలను బదిలీ చేస్తూ కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్పీలు ఉత్తర్వులిచ్చారు. దీంతో త్వరలో ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 11, 2024

దాతలు ముందుకు రావ‌డం అభినంద‌నీయం: మంత్రి భ‌ర‌త్

image

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. అప‌ర్ణ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు రూ.25 ల‌క్ష‌లు అందించింది. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యంలో కంపెనీ ప్ర‌తినిధులు భ‌ర‌త్‌ను క‌లిసి చెక్కును అందించారు. మంత్రి మాట్లాడుతూ.. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం అన్నివిధాలా కృషి చేస్తుంద‌ని చెప్పారు.

News September 11, 2024

కర్నూలు: మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు

image

అసభ్య పదజాలంతో దూషించిన మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ఆలూరు నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకుడు వెంకటేశ్ చౌదరి మంగళవారం ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరద బాధితులకు మంచి చేస్తున్న సీఎంపై లోఫర్ అంటూ అసభ్య పదజాలంతో దూషించడం మాధ్యమాల్లో చూశామన్నారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News September 11, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు సహకరించాలన్నారు.