News October 14, 2024

KNL: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న (కర్నూలు-99, నంద్యాల-105) మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలుకు సంబంధించి జడ్పీ సమావేశ మందిరంలో, నంద్యాలకు సంబంధించి కలెక్టరేట్ సెంటినరీ హాల్లో లాటరీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News November 12, 2024

KC కెనాల్ గురించి తెలుసా?

image

KC కెనాల్ (కర్నూలు-కడప కాలువ) రాయలసీమలోని ఒక ప్రధాన పంట కాలువ. 1950లో నిర్మితమైంది. ఇది పెన్నా, తుంగభద్ర నదులను అనుసంధానిస్తుంది. ఈ కాలువ కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల బ్యారేజీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ కెనాల్ పొడవు 305.60 కి.మీ కాగా దీని కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇది కర్నూలు, కడప జిల్లాల రైతులకు ప్రాణప్రదమైన కాలువ.

News November 12, 2024

కేశవ్ పద్దు.. కేసీ కెనాల్‌కు అధిక నిధులు

image

➤ ఉమ్మడి కర్నూల్ జిల్లా ప్రాజెక్టులకు రూ.445.81కోట్లు
➤ అధికంగా కేసీ కెనాల్‌కు ₹253.10కోట్లు
☞ ఎల్లెల్సీకి ₹13కోట్లు, గాజులదిన్నెకు ₹11.80కోట్లు
☞ గుండ్రేవుల జలాశయానికి నిధులు నిల్
➤ జిల్లాలో గుంతలు పూడ్చేందుకు ₹15.73కోట్లు
➤ RUకి రూ.10.45కోట్లు, ఉర్దూ వర్సిటీకి రూ.1.5కోట్లు
➤ అన్నదాత సుఖీభవ పథకానికి ₹346.15 కోట్లు
➤ తల్లికి వందనం పథకానికి రూ.6వేల కోట్లు
☞ జిల్లాలో సుమారు 4 లక్షల మంది లబ్ధిదారులు

News November 12, 2024

జగన్.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రా: మంత్రి బీసీ

image

మాజీ సీఎం జగన్‌కు మాట్లాడేందుకు మైక్ ఇస్తాం.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధం. తప్పులు చేసినందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత పోస్టులు పెడితే ఊరుకోం. చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం’ అని స్పష్టం చేశారు.