News August 17, 2024

KNL: ఫెయిల్ అయిన విద్యార్థులకు SVU శుభవార్త

image

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులు ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినవారికి యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. ఆ విద్యార్థులు మరోసారి పరీక్షలు రాసి పాస్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు SV యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉత్తర్వులు జారీ చేశారు. Website: www.svuniversity.edu.in

Similar News

News September 10, 2024

ఆళ్లగడ్డ విషాద ఘటన.. కన్నీళ్లు తెప్పించే విషయం

image

ఆళ్లగడ్డ వినాయక చవితి ఉత్సావాల్లో విషాద <<14057436>>ఘటన<<>> జరిగిన విషయం తెలిసిందే. గంగమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో అశోక్‌ (32) అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందారు. కాగా అశోక్ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఏడాది క్రితం ఆయనకు వివాహం కాగా ప్రస్తుతం భార్య ఏడు నెలల గర్భిణి. భర్త అకాల మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపగా మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News September 10, 2024

కర్నూల్ యువతికి గోల్డ్ మెడల్

image

కర్నూల్ యువతి గోల్డ్ మెడల్ గెలిచారు. గత నెల 31 నుంచి సెప్టెంబర్ 6 నేపాల్‌లో ఎస్బీకేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో కర్నూలుకు చెందిన రేష్మ పాల్గొని సత్తా చాటారు. 57 కేజీల మహిళల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా రేష్మను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన నివాసంలో అభినందించారు.

News September 10, 2024

నంద్యాలలో 10న దిశా కమిటీ సమావేశం

image

ఈ నెల 10వ తేదీ దిశా కమిటీ (కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు, అభివృద్ధిపై సమీక్ష) సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, కన్వీనర్ జి.రాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో సోమవారం ఉ.10 గంటలకు ఎంపీ బైరెడ్డి శబరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లా మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు.