News October 30, 2024

KNL: బాలికతో అసభ్య ప్రవర్తన.. కరెస్పాండెంట్‌పై పోక్సో కేసు?

image

కర్నూలులోని బుధవారం పేటలో ఉన్న ఓ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ 8వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తాజాగా వెలుగుచూసింది. స్థానికుల వివరాల మేరకు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నిన్న రాత్రి 9 గంటల సమయంలో స్కూల్‌పై దాడి చేసి కరస్పాండెంట్ చంద్రశేఖర్‌ను చితకబాదారు. ఆపై మూడో పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టాలను అనుసరించి కేసు నమోదు చేశారు.

Similar News

News November 20, 2025

కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే ఒక నెల జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 17వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News November 19, 2025

అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.

News November 19, 2025

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం: ఎస్పీ

image

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్‌ చేయరని, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.