News December 19, 2024

KNL: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం!

image

కర్నూలు జిల్లా అస్పరి మండలంలోని ఓ గ్రామంలో మతిస్థిమితం లేని ఓ మహిళ(35)పై బుధవారం హనుమంతు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళను ఆశ్రమంలో విడిచిపెడతానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళ్లిన అతను.. ఆశ్రమానికి తీసుకెళ్లకుండా తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ తెలిపారు.

Similar News

News January 18, 2025

పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

image

నంద్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను శనివారం DAHO డా.గోవింద్ నాయక్‌తో కలిసి కలెక్టర్ జీ.రాజకుమారి ఆవిష్కరించారు. ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించే ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News January 18, 2025

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ ప్రాంగణంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అన్న క్యాంటీన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు.

News January 18, 2025

మంత్రి ఫరూక్‌పై సీఎం అసంతృప్తి!

image

మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలోనూ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంలో మంత్రి ఫరూక్ వెనుకబడ్డారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పీఆర్వో, ఉద్యోగులను ఇచ్చినా చివరిస్థానంలో నిలవడం సరికాదరి, ఈసారి ర్యాంకు మెరుగవ్వాలని సూచించారు.