News October 30, 2024

KNL: బాలికతో అసభ్య ప్రవర్తన.. కరెస్పాండెంట్‌పై పోక్సో కేసు?

image

కర్నూలులోని బుధవారం పేటలో ఉన్న ఓ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ 8వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తాజాగా వెలుగుచూసింది. స్థానికుల వివరాల మేరకు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నిన్న రాత్రి 9 గంటల సమయంలో స్కూల్‌పై దాడి చేసి కరస్పాండెంట్ చంద్రశేఖర్‌ను చితకబాదారు. ఆపై మూడో పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టాలను అనుసరించి కేసు నమోదు చేశారు.

Similar News

News October 30, 2024

కర్నూలు: బీఈడీలో ఫెయిలైన వారికి మరో అవకాశం

image

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలో విద్యను అభ్యసించి కోర్సును పూర్తి చేసుకోలేని 2015, 2016, 2017, 2018, 2019 విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 30, 2024

ఆదోని మార్కెట్ యార్డుకు 4 రోజుల సెలవులు

image

దీపావళి వేళ ఆదోని మార్కెట్ యార్డుకు రేపటి నుంచి ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. హమాలీ సంఘాలు, కమీషన్ ఏజెంట్ల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ యార్డ్‌ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 4 నుంచి క్రయవిక్రయాలు మొదలవుతాయని చెప్పారు. రైతులు గమనించాలని కోరారు.

News October 30, 2024

కర్నూలు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రచురణ

image

స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, తహశీల్దార్ వెంకటలక్ష్మి ముసాయిదాను ప్రచురించి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ప్రతులను అందజేశారు. వచ్చే నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు.