News March 17, 2024

KNL: ఇకపై ఊపందుకోనున్న అభ్యర్థుల ప్రచార పర్వం

image

మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ శనివారం సాయంత్రంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో YCP, TDP-JSP-BJP, కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగనున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈసారి ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇవ్వనున్నారు.

Similar News

News January 19, 2026

వాట్సాప్‌లోనే FIR కాపీ.. స్టేషన్లకు వెళ్లక్కర్లేదు!

image

మద్దికేర పోలీస్ స్టేషన్ పరిధిలోని FIR వివరాలు ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని SI హరిత ఆదివారం తెలిపారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపి, మెనూలో పోలీస్ విభాగాన్ని ఎంచుకుని కేస్ నంబర్ ఎంటర్ చేస్తే ఉచితంగా కాపీ లభిస్తుందన్నారు. దీనివల్ల ప్రజలు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఈ నూతన విధానంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 18, 2026

కర్నూలులో బహిరంగ హెచ్చరిక బ్యానర్లు

image

కర్నూలు నగరంలో ఆస్తిపన్ను మొండి బకాయిల వసూళ్లను నగరపాలక సంస్థ మరింత కఠినతరం చేస్తోంది. ఈక్రమంలో ‘మేలుకో బకాయిదారుడా!’ అనే శీర్షికతో ఆదివారం హెచ్చరికాత్మక బ్యానర్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో అయినా బకాయిదారుల్లో చైతన్యం వచ్చి, స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

News January 18, 2026

కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

image

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్‌ రూ.300, స్కిన్‌లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.