News October 26, 2025

కొమురం భీమ్‌ గురించి తెలుసుకోండి: మోదీ

image

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.

Similar News

News October 26, 2025

టాస్ గెలిచిన భారత్

image

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్‌లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా

News October 26, 2025

నారద భక్తి సూత్రాలు – 8

image

నిరోధస్తు లోకవేదవ్యాపార వ్యప:
మనం చేసే సాధారణ పనులైనా, దేవుడికి సంబంధించిన పనులైనా.. వాటి ఫలితం గురించి ఆలోచించకుండా ‘దేవుడా! నీ కోసమే చేస్తున్నాను’ అని వాటిని ఆయనకు అప్పగించాలని ఈసూత్రం సూచిస్తోంది. ఫలితంగా మన మనసులో ఆందోళన, స్వార్థం పోతాయని, మన ప్రతి పని దైవసేవగా మారుతుందని చెబుతోంది. ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం వదిలి ‘అంతా దేవుడే చేయిస్తున్నాడు’ అనే నమ్మకంతో ఉండటమే ఈ సూత్ర సారాంశం. <<-se>>#NBS<<>>

News October 26, 2025

విషాదం: మట్టిపెళ్లలు విరిగిపడతాయని పంపిస్తే..

image

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దంపతులను దురదృష్టం వెంటాడింది. NH-85 విస్తరణ పనుల్లో భాగంగా మన్నంకందంలో కొండను తవ్వుతున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని 22 కుటుంబాలను నిన్న సాయంత్రం రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే రాత్రికి భోజనం కోసం బిజు(48), సంధ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో మట్టి, బురద ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. బిజు చనిపోగా, సంధ్య తీవ్రంగా గాయపడ్డారు.