News July 13, 2024
పవర్ఫుల్ IAS కృష్ణతేజ గురించి తెలుసా?

పల్నాడు(D) చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ 2014 సివిల్స్లో 66వ ర్యాంక్ సాధించారు. 2018లో కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ 2.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు. కృష్ణతేజ డిప్యుటేషన్పై ఏపీకి రానున్నారు. పవన్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఈయనకు అప్పగించే ఛాన్స్ ఉంది.
Similar News
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News December 1, 2025
₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.


