News February 16, 2025

మీ ఫోన్‌లో రేడియోషన్ ఎంతో తెలుసుకోండి

image

మనం వాడే మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ విడుదలవుతుంది. అయితే మన ఫోన్ ఎంత రేడియోషన్ విడుదల చేస్తుందనేది తెలియకపోవచ్చు. దీనిని SAR(స్పెసిఫిక్ అబ్జార్‌ప్షన్ రేటు) ద్వారా నిర్ణయించవచ్చు. మీ ఫోన్ డయల్ పాడ్‌లో *#07# ను ఎంటర్ చేయడం ద్వారా ఈ SAR తెలుసుకోవచ్చు. మన దేశంలో మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే SAR లిమిట్ 1.6W/kg వరకు ఉంది.
ShareIt

Similar News

News September 15, 2025

రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

image

TG: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్‌కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.

News September 15, 2025

ఈ జపనీస్ టెక్నిక్​తో హెల్తీ స్కిన్

image

జపనీయులు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు 4-2-4 టెక్నిక్ యూజ్ చేస్తారు. ముందుగా ఆయిల్​ బేస్డ్ క్లెన్సర్​తో ముఖాన్ని 4నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్​తో 2నిమిషాలు సున్నితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివర్లో 2 నిమిషాలు వేడినీటితో, మరో 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పద్ధతి వల్ల చర్మానికి డీప్ క్లెన్సింగ్ అవుతుంది. రక్తప్రసరణ పెరిగి చర్మం బిగుతుగా మారుతుంది.

News September 15, 2025

పీసీఓఎస్‌తో తగ్గుతున్న ప్రతిస్పందన వేగం

image

ప్రస్తుతం చాలామంది మహిళలు PCOSతో బాధపడుతున్నారు. వీరిలో షుగర్, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. అయితే PCOS బాధితుల్లో ప్రతిస్పందన వేగం తగ్గుతున్నట్లు IITబాంబే నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఏకాగ్రత తగ్గడం, నెమ్మదిగా స్పందించడం PCOS బాధితుల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇన్సులిన్‌ హెచ్చుతగ్గులతో మెదడు కణజాలం ప్రభావితమై కాగ్నిటివ్ హెల్త్ దెబ్బతింటున్నట్లు తెలిపారు.