News July 8, 2024
ప్రతి తిరస్కరణ ఆశీర్వాదం అని తెలుసుకుంటారు: ప్రశాంత్ వర్మ

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసంతృప్తితో చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ను ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ తన తదుపరి చిత్రం ‘రాక్షసుడు’ను రణ్వీర్తో తీయాలనుకోగా.. విభేదాలు రావడంతో తాజాగా క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News December 13, 2025
SMAT: నలుగురు క్రికెటర్లు సస్పెండ్

SMATలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో క్రికెటర్లు అమిత్, అహ్మద్, అమన్, అభిషేక్ను అస్సాం క్రికెట్ అసోసియేషన్(ACA) సస్పెండ్ చేసింది. ఆపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR నమోదైంది. విచారణ పూర్తయ్యే వరకూ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని వారిని ఆదేశించింది. వీళ్లు SMATలో ప్లేయర్లను ప్రభావితం చేసి అవినీతికి ప్రేరేపించినట్లు ఆరోపణలున్నాయి. అటు అస్సాం జట్టు SMAT సూపర్ లీగ్ దశకు చేరలేదు.
News December 13, 2025
గుమ్మం ముందు కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు. SHARE IT
News December 13, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


