News August 3, 2024
ఫోన్లో ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది!

వచ్చే ఏడాదిలోపు ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబులు, కొన్ని శామ్‌సంగ్ వాచుల్లో ‘స్కూల్ టైమ్’ ఫీచర్‌ను గూగుల్ విస్తరించనుంది. పాఠశాల వేళల్లో పిల్లలు ఫోన్ అన్ లాక్ చేస్తే బ్లాక్ స్ర్కీన్ మాత్రమే చూపిస్తుంది. పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చిన యాప్స్ మాత్రమే వారు చూడగల్గుతారు. తొలుత మేలో LTE స్మార్ట్‌వాచ్‌లో ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. త్వరలో YouTubeలో పిల్లల యాక్టివిటీని తెలుసుకోవచ్చు.
Similar News
News March 4, 2026
రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
News March 4, 2026
ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చు: ట్రంప్

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక గతంలో కంటే కూడా తగ్గుతాయని భావిస్తున్నాని చెప్పారు. ఇరాన్‌పై ఇప్పుడు దాడి చేయకపోతే అణుయుద్ధం వచ్చేదన్నారు. కాగా ఇరాన్‌పై దాడుల్లో సహకరించని స్పెయిన్‌తో ట్రేడ్ రద్దు చేసుకుంటామన్న ట్రంప్ యూకేపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 4, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 4)

* 1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
* 1973: తెలుగు సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం
* 1964: తెలుగు, కన్నడ కవి కిరికెర రెడ్డి భీమరావు మరణం
* 2002: ఒడిశా, బెంగాల్, త్రిపుర మాజీ గవర్నర్ కె.వి.రఘనాథరెడ్డి మరణం (ఫొటోలో కుడివైపు)
* 2016: లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా మరణం
* జాతీయ భద్రతా దినోత్సవం
* ప్రపంచ ఊబకాయ దినోత్సవం


