News April 5, 2025
KNR:టీటీడీ చైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారీ ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.రాజ్ గోపాల్ నాయుడుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం టిటిడి చైర్మన్‌కు కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్ ప్రత్యేక లేఖ రాశారు. పద్మానగర్‌లో పదెకరాల స్థలంలో దేవాలయ నిర్మాణానికి గతంలోనే అనుమతులు లభించినందున నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించారు.
Similar News
News April 8, 2025
సన్న బియ్యం పంపిణీ చేసిన ఆసిఫాబాద్ కలెక్టర్

ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యంను ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ అన్నారు. మంగళవారం వాంకిడి డీఆర్డీపోలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ RDO లోకేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
News April 8, 2025
ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏడాది పన్ను అంతా చెల్లించి 5 శాతం రాయితీ పొందవచ్చని GVMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధీర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ నెలలో ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 8, 2025
అమరావతిలో రేపు చంద్రబాబు కొత్త ఇంటికి శంకుస్థాపన

AP: సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E-9 రోడ్ పక్కనే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఉదయం 8.51 గంటలకు చంద్రబాబు కుటుంబసభ్యులు భూమిపూజ చేస్తారు. అనంతరం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయనున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పుడే స్థలం చదును పనులు కూడా చేపట్టారు.