News March 30, 2024
KNRలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ MLA

KNRలో BJPకి బిగ్ షాక్ తగిలింది. మానకొండూర్ మాజీ MLA ఆరెపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు కాంగ్రెస్‌లో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన ఆయన.. శాసనసభ ఎన్నికల్లో BJPలో చేరి, పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం HYDలోని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. MP టికెట్ ఆయనకు కేటాయించనందుకే పార్టీ మారినట్లు సమాచారం.
Similar News
News March 14, 2026
KNR: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. వినూత్న శిక్ష

కరీంనగర్‌లో మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన మంకమ్మతోటకు చెందిన టి.శేఖర్‌కు కోర్టు వినూత్న శిక్ష విధించింది. రూ.6 వేల జరిమానా చెల్లించకపోవడంతో, రెండో తరగతి ప్రత్యేక మేజిస్ట్రేట్ డాక్టర్ ఈదుల లక్ష్మి ఈ తీర్పునిచ్చారు. దీని ప్రకారం నిందితుడు మార్చి 13 నుంచి ఏడు రోజుల పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
News March 13, 2026
KNR: అల్లరి మూకల అదుపుపై పోలీసులకు శిక్షణ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఆర్, క్యూఆర్‌టీ బలగాలకు ‘మాబ్ ఆపరేషన్ డ్రిల్’ నిర్వహించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో సిబ్బందికి లాఠీఛార్జ్, స్మోక్ గన్, ‘వజ్ర’ వాహన వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అల్లరి మూకలను వ్యూహాత్మకంగా అదుపు చేస్తూనే, స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News March 13, 2026
కరీంనగర్ పీటీసీలో ఘనంగా దీక్షాంత పరేడ్

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో 99 మంది నూతన కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్ ఘనంగా జరిగింది. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుంచి సీపీ గౌష్ ఆలం గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ చాటిన వారికి అవార్డులు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీపీ పిలుపునిచ్చారు.


