News April 5, 2025

KNR:టీటీడీ చైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

image

కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారీ ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.రాజ్ గోపాల్ నాయుడుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం టిటిడి చైర్మన్‌కు కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్ ప్రత్యేక లేఖ రాశారు. పద్మానగర్‌లో పదెకరాల స్థలంలో దేవాలయ నిర్మాణానికి గతంలోనే అనుమతులు లభించినందున నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించారు.

Similar News

News April 6, 2025

నారాయణపేట: ఆరుగురిపై కేసు నమోదు 

image

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల శివారులో కొంత మంది జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఉట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,700 నగదు, 6 సెల్‌ఫోన్లు, 3 బైక్‌లు, పేకముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఎస్ఐ కృష్ణంరాజు శనివారం తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

News April 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 6, 2025

ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

image

1886: హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జననం
1928: DNAను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం
1956: భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
1975: దర్శకుడు వీరభద్రం చౌదరి జననం
2011: తెలుగు నటి సుజాత మరణం
1896: తొలి ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్‌లో ప్రారంభం

error: Content is protected !!