News August 23, 2025
KNRలో రేపు జిల్లాస్థాయి యోగాసన పోటీలు

జూనియర్ విభాగాల్లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు రేపు నిర్వహించనున్నట్లు TG యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ KNR యూనిట్ కన్వీనర్ ఎం.రమేష్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని SEPలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ట్రెడిషనల్ యోగా, ఫార్వర్డ్ బైండ్, బ్యాక్ బెండ్ తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు శనివారం సా.6 గం.లోపు 8522920561ను సంప్రదించాలన్నారు.
Similar News
News August 23, 2025
KNR: ‘నిర్వాహకులు పోలీస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి’

గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉల్ నబీ పండుగలను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో శాంతి కమిటీ సభ్యులతో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఈసారి నగరంలో సుమారు 3300 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు గణేష్ మండప వివరాలను పోలీస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
News August 23, 2025
KNR: ‘ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి’

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులున్నారు.
News August 23, 2025
KNR: ప్రాథమిక, అంగన్వాడీ చిన్నారులకు ఆటల పోటీలు

జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, అంగన్వాడీ చిన్నారులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. రన్నింగ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు.