News October 16, 2025

KNRలో TASK i4TY 2.0 ఫిజికల్ ఐడియాథాన్ విజయవంతం

image

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ & నాలెడ్జ్(TASK) ఆధ్వర్యంలో రాష్ట్ర యువతలో నైపుణ్యం, ఔత్సాహిక పారిశ్రామికతను ప్రోత్సహించే లక్ష్యంగా నిర్వహించిన ‘TASK i4TY (ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ యూత్) 2.0 ఫిజికల్ ఐడియాథాన్’ విజయవంతమైంది. KNR IT TOWERలోని TASK రీజినల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ థీమ్‌తో స్థానిక సమస్యలకు నూతన పరిష్కారాలు, వ్యాపార నమూనాలను అందించేలా ఈ ఐడియాథాన్‌ను రూపొందించారు.

Similar News

News October 17, 2025

కేయూ రిజిస్ట్రార్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

image

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రంకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేయూలో తాత్కాలిక
ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పోరిక రమేశ్ తనను యూనివర్సిటీలోని అధికారులు వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషన్ రిజిస్ట్రార్‌‌ను వివరణ కోరుతూ 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

News October 17, 2025

MNCL: చిరు వ్యాపారులకు చేయూత

image

చిరు, వీధి విక్రయదారులకు బ్యాంక్ రుణాలు అందించి వ్యాపార అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. లోక కళ్యాణం పథకంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెప్మా అధికారులు వీధి విక్రయదారులను గుర్తించి రుణాలు అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 29000 మంది వ్యాపారులకు రూ.45 కోట్లకు పైగా రుణాలను అధికారులు అందజేశారు.

News October 17, 2025

కరీంనగర్: గ్రేడ్ A రకానికి రూ.2,389/-

image

2025-26 వానాకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్‌లో 9.24 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ నేపథ్యంలో 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,304 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశారు. గ్రేడ్ A రకం వడ్లకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369లను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది.