News October 27, 2024
KNR: అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ప్రథమ సంవత్సర రెండో సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 4 నుంచి ప్రారంభమవుతాయని ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు మ.2 గంటల నుంచి కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులందరూ హాజరుకావాలని ఆయన కోరారు.
Similar News
News November 17, 2025
మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.

స్టూడెంట్స్ క్లబ్ విధానం స్ఫూర్తిదాయకం: బండి సంజయ్

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు. వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న కలెక్టర్‌ను ఆయన అభినందించారు.