News February 27, 2026

KNR: అగ్రనేతల లొంగుబాటు.. మావోలకు ‘చెక్’ పడినట్లేనా?

image

2026 మార్చి 31కి దేశాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం గడువు విధించుకుంది. ఇప్పటికే ఉమ్మడి KNR జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి లొంగిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో కుల వివాదంతో చిన్నారి మృతి చెందడం, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులకు గురికావడం వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో నక్సలిజం కొనసాగుతుందా? లేక కేంద్రం చెక్ పెడుతుందా అన్న విషయం చర్చనీయాంశమైంది.

Similar News

News April 16, 2026

నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 12.85 లక్షలు

image

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.

News April 16, 2026

భద్రాచలం: ఫలితాల్లో ఏకలవ్య విద్యార్థుల ప్రభంజనం

image

పదో తరగతి సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్ పాఠశాలలు (EMRS) 99.78 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించాయి. మొత్తం 455 మంది విద్యార్థులకు గాను 454 మంది పాసయ్యారని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. 8 పాఠశాలల్లో 7 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, బాలికలందరూ ఉత్తీర్ణత పొందడం విశేషం. ప్రతిభ చాటిన 18 మంది విద్యార్థులను పీవో ప్రత్యేకంగా అభినందించారు.

News April 16, 2026

యుద్ధానికి సిద్ధపడుతున్న ఇరాన్?

image

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ఓవైపు పాక్ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్‌లో పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి స్కూళ్లకు వర్చువల్ లెర్నింగ్‌ అమలు చేయనుంది. స్కూళ్లపైనా గతంలో <<19620831>>దాడులు<<>> జరిగిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మిస్సైల్ కేంద్రాల మరమ్మతులను ఇరాన్ ముమ్మరం చేసింది.