News August 10, 2024
KNR: అత్తింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన BHPL జిల్లా మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర కుమార యాదవ్ వివరాల ప్రకారం.. మీనాజీపేటకు చెందిన జమున(24)కు అదే గ్రామానికి చెందిన సమ్మయ్యతో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్లి నచ్చకపోవడంతో అప్పటినుంచి భర్త తల్లి పద్మ, భర్త సోదరుడు పవన్ నిత్యం వేధించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News September 9, 2024
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి
జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
News September 8, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు
ఓదెల: మాజీ సర్పంచ్ సాగు చేస్తున్న సీలింగ్ భూమిపై ఫిర్యాదు. సిరిసిల్ల: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత! కరీంనగర్: లోయర్ మానేరు డ్యాములో 20.66 టీఎంసీల నీరు నిల్వ. పెద్దపల్లి: బార్డర్ లో రామగుండం యువ జవాన్ అనుమానాస్పద మృతి?. పెద్దపల్లి: అక్రమాలపై యంత్రాంగం ఉక్కు పాదం. రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి. జగిత్యాల: గణనాథుల వద్ద రెండవ రోజు కొనసాగుతున్న భక్తుల కోలాహలం.
News September 8, 2024
KNR: టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయి: కేంద్రమంత్రి
టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలు మారతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ‘గురు వందనం’ కార్యక్రమంలో పాల్గొని పలువురు ఉత్తమ టీచర్లను సన్మానించారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం మీ సమస్యలు తీరవు అన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయలు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం (TUPS) మాత్రమే అని తెలిపారు.