News September 17, 2024
KNR: అనుమానాస్పద స్థితిలో సింగరేణి ఉద్యోగి మృతి
గోదావరిఖని జీఎం కాలనీ సింగరేణి కార్మికుడు హరినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న జీడీకే-1 ఇంక్లైన్‌కి చెందిన బానోతు హరినాథ్ సింగ్ తన క్వార్టర్లో మృతి చెందాడు. అయితే మృతుడి మెడపై గాయాలు ఉండటంతో.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 4, 2024
దుర్గామాతను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి
రామగుండం మున్సిపల్ పరిధిలోని 42వ డివిజన్, 50వ డివిజన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గామాతను మొదటి రోజు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.
News October 4, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొలువుదిరిన దుర్గ మాతలు @ కొండగట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. @ దసరా లోపు టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. @ ఎల్లారెడ్డిపేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. @ కేశవపట్నం పోలీస్స్టేషన్ లో నాగుపాము హల్చల్.
News October 3, 2024
కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.