News May 12, 2024
KNR: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమలోనూ, బాధ్యతలోనూ. మన KNR జిల్లాలో 33,93,580 మంది ఓటర్లున్నారు. – నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.
Similar News
News September 15, 2025
KNR: ‘పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి’

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు.
News September 15, 2025
“ఉల్లాస్” నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో కరీంనగర్

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఉల్లాస్లో భాగంగా జిల్లాలో 32777 మంది నమోదు లక్ష్యం నిర్ణయించగా 69958 మందిని ఈ కార్యక్రమంలో చేర్పించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ లో అడ్మిషన్లు, స్వయం సహాయక సంఘాల్లో బాలికలు, వయోవృద్ధులు, దివ్యాంగులను చేర్పించడం వంటి కార్యక్రమాల్లోనూ జిల్లా ముందు వరుసలో ఉంది. అధికారులను కలెక్టర్ అభినందించారు.
News September 15, 2025
KNR: ‘ప్రజావాణి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత’

సోమవారం ప్రజావాణి కార్యక్రమానంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరిస్తున్నామని అన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 27580 దరఖాస్తులు రాగా 1810 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు.