News May 12, 2024
KNR: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమలోనూ, బాధ్యతలోనూ. మన KNR జిల్లాలో 33,93,580 మంది ఓటర్లున్నారు. – నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.
Similar News
News February 14, 2025
కరీంనగర్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా విధులకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, అందువల్ల ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు.
News February 13, 2025
జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.
News February 13, 2025
కరీంనగర్: సఖి సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి కేంద్రం, మహిళా సాధికారత విభాగం సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సఖి కేంద్రం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మేనేజ్మెంట్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సఖి సేవలను గురించి అందరికీ తెలిసేలా ప్రజలు సందర్శించే స్థలాల్లో, కలెక్టరేట్ ప్రాంగణంలో బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.