News February 20, 2025
KNR: ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

వచ్చే నెలలో నిర్వహించనున్న ఇంటర్ పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇంటర్ పదోతరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
Similar News
News September 14, 2025
నిర్మల్: ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్ల గడువు పెంపు

2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ స్కూల్స్ లో ప్రవేశాల గడువును ఈ నెల 18 వరకు పొడిగించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆలస్య రుసుము అవసరం లేదని తెలిపారు. 19, 20 తేదీలలో ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News September 14, 2025
NTR స్మృతివనంలో విగ్రహం ఏర్పాటుపై సమీక్ష

AP: అమరావతిలోని నీరుకొండ వద్ద నిర్మించే NTR స్మృతివనం తెలుగువారి ఆత్మగౌరవం-ఆత్మవిశ్వాసం కలగలిపి వైభవంగా ఉండాలని CM చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టులో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, ప్రాచీన చరిత్రకు పెద్దపీట వేయాలన్నారు. NTR విగ్రహం ఏర్పాటుపై సమీక్షించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 14, 2025
సెప్టెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

1883: స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1923: ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ జననం
1958: అవధాని గరికపాటి నరసింహారావు జననం
1962: సినీ నటి మాధవి జననం
1967: HYD మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు మరణం
1984: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జననం
1990: టీమ్ ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
*హిందీ భాషా దినోత్సవం