News February 20, 2025

KNR: ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

వచ్చే నెలలో నిర్వహించనున్న ఇంటర్ పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇంటర్ పదోతరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

Similar News

News March 24, 2025

ఖమ్మం: జోష్ పెంచిన బీఆర్ఎస్  

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 9స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. BRSలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం కాంగ్రెస్‌లో చేరడంతో BRS ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల తరువాత BRSనేతలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే పార్టీ అధినేత ఆదేశాల మేరకు కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళుతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రెస్‌మీట్‌లు పెట్టి అధికార పార్టీకి కౌంటర్‌లు ఇస్తోంది.

News March 24, 2025

WGL: ప్రారంభమైన మార్కెట్.. రూ.7 వేలు దాటిన ధర

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఈరోజు ప్రారంభం కాగా పత్తి ధరలు వచ్చింది. అయితే ధర మాత్రం గత వారం లాగే రూ.7 వేల మార్కు దాటింది. గత వారం మొదట్లో రూ.7,100 పలికిన క్వింటా పత్తి ధర.. వారం చివరి నాటికి రూ.7,010కి పడిపోయింది. నేడు (సోమవారం) పత్తి ధర రూ.7,030కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు.

News March 24, 2025

ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!