News February 13, 2025
KNR: ఇసుక రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి: కలెక్టర్

ఇసుక రవాణాపై నిరంతర నిఘా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, రవాణా అధికారులను బృందాలుగా ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసినా, అనుమతి కంటే ఎక్కువ లోడుతో ఇసుక తరలించినా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద నిఘా వ్యవస్థను పెంచాలని సూచించారు.
Similar News
News October 29, 2025
CM సార్.. వికారాబాద్ జిల్లా ఏడుస్తోంది..!

వికారాబాద్ జిల్లా నుంచి CM రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, MLAలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా తన దీన స్థితి చూసి వికారాబాద్ జిల్లా ఏడ్చే దుస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ఏ మూల వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు. కనీసం రోడ్లు బాగు చేయని పాలకులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. పైఫొటో VKBలోని రైతుబజార్ సమీపంలోని రోడ్డు.
News October 29, 2025
WGL: తేజా మిర్చి రూ.14,200

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.16,300 ధర పలకగా.. బుధవారం రూ.16,000 కి తగ్గింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి మంగళవారం రూ.16,300 ధర వస్తే.. ఈరోజు సైతం అదే ధర వచ్చింది. తేజ మిర్చి ధర సోమ, మంగళవారం రూ.14,100 పలికితే.. ఈరోజు రూ.14,200 ధర పలికింది.
News October 29, 2025
విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.


