News March 24, 2024

KNR: ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డే కు చిట్టాపూర్ వచ్చాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్ళాడు. శివకుమార్‌కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 23, 2026

క్రీడల్లో కరీంనగర్ పోలీసుల పతకాల వేట

image

సైబరాబాద్‌లో జరిగిన 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏసీపీ మాధవి, పీసీలు స్వప్న, శ్రీజ, శ్రీధర్ పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను సీపీ గౌష్ ఆలం అభినందిస్తూ.. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో రాణించడం గర్వకారణమని కొనియాడారు.

News February 22, 2026

రేపు యథావిధిగా ‘ప్రజావాణి’: జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉదయం నిర్ణీత సమయానికి అధికారులు హాజరై ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News February 22, 2026

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.