News February 7, 2025

KNR: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

Similar News

News March 23, 2025

విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: షీ టీం ఎస్ఐ సునంద

image

మహబూబాబాద్ జిల్లా సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మహిళా ఫార్మసీ కళాశాలలో షీ టీం ఎస్ఐ సునంద పలు విషయాలపై శనివారం అవగాహన కల్పించారు. నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. జాగ్రత్తగా మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News March 23, 2025

గేట్‌లో పంగులూరు విద్యార్థికి ఆలిండియా 81 ర్యాంకు

image

2025 సంవత్సరానికి సంబంధించి గేట్ పరీక్షలో పంగులూరు గ్రామానికి చెందిన పుత్తూరి లక్ష్మీ శ్రీ సాయి లోకేశ్‌కు ఆల్ ఇండియా స్థాయిలో 81వ ర్యాంకు వచ్చింది. సాయి లోకేశ్ ఏడో తరగతి వరకు ఒంగోలులో, పదో తరగతి వరకు చిలకలూరిపేటలో, పాలిటెక్నిక్‌ను ఒంగోలులోని దామచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు.

News March 23, 2025

ద్వారకాతిరుమల: కిడ్నాపర్‌కు సహకరించిన వ్యక్తి అరెస్ట్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ద్వారకాతిరుమల మండలానికి చెందిన బాలికను తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు 3 నెలల క్రితం కిడ్నాప్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడితోపాటు మరో ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేశారు. నిందితుడికి సహకరించిన తెలంగాణ రాష్ట్రం, కలిగోట్‌కు చెందిన సురేశ్‌ను శనివారం అరెస్ట్ చేశారు.

error: Content is protected !!