News July 14, 2024
KNR: ఈనెల 18 నుంచి 5 కేంద్రాల్లో DSC పరీక్షలు

జిల్లాలో DSC పరీక్షను ఆన్లైన్ ద్వారా ఈనెల 18 నుంచి వచ్చేనెల 5 వరకు 5 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు DEO జనార్ధన్ రావు తెలిపారు. KNRలోని అల్ఫోర్స్ మహిళ డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాల, ఎల్ఎండి కాలనీ లోని ion digital zone వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, హుజూరాబాద్ మండలం సింగపూర్లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలున్నాయని చెప్పారు.
Similar News
News November 13, 2025
కరీంనగర్: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. ఈ అదాలత్లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.
News November 13, 2025
శాతవాహన ఆర్ట్స్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్పై అవగాహన

శాతవాహన విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో కళాశాల ప్రిన్సిపల్ సుజాత అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, కొత్తపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, షీ టీమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత అవగాహన కల్పించారు.
News November 13, 2025
కరీంనగర్లో ఈనెల 18న JOB MELA

జిల్లాలోని నిరుద్యోగులకు ఓ ప్రముఖ జ్యూవెలర్స్లో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయస్సు19- 30 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులన్నారు. వేతనం రూ.20,000 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆసక్తి గలవారు నవంబర్ 18న వచ్చి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పైనంబర్లను సంప్రదించవచ్చు.


