News November 20, 2024

KNR: ఈనెల 23న కార్తీకమాస లక్ష దీపకాంతుల మహోత్సవం

image

కార్తీక మాసం సందర్భంగా KNR మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవాని ఆలయంలో ఈనెల 23న సాయంత్రం కార్తీకమాస లక్ష దీపకాంతుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మన్‌ తెలిపారు. ఈనెల 23న ఉదయం సామూహిక సత్యనారాయణ వ్రతం, తులసీ కళ్యాణం, సాయంత్రం అమ్మవారికి కార్తీక మాస ప్రయోక్త చతుషష్టి పూజలు, దీపాసంకల్పం, దీపారాధన, మహా మంగళ హారతి అనంతరం లక్షదీపోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు.

Similar News

News December 2, 2024

రికార్డు స్థాయిలో 1.53కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్రంలో అత్యధికంగా1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 4న సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి కి వచ్చారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.

News December 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్.@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రత అరెస్ట్. @ జగిత్యాల లో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ. @ పెద్దపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసన్నా ఆలయాలను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్.

News December 1, 2024

పెద్దపల్లి: పాఠశాల భోజనాలను తరచుగా తనిఖీ చేయాలి: మంత్రి పొన్నం 

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని మంత్రి పొన్నం అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్, ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. మెస్ ఛార్జీల బిల్లులను గ్రీన్ చానల్స్ ద్వారా సరఫరా చేస్తామన్నారు.