News August 4, 2024

KNR: ఈనెల 5న ప్రజావాణి రద్దు

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం (ఆగస్టు 5వ తేదీన ) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ వివరించారు.

Similar News

News December 16, 2025

కరీంనగర్: ఎన్నికల బందోబస్తుకు 877 మంది పోలీసు సిబ్బంది

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 20 ఇన్స్పెక్టర్లు, 39 ఎస్సైలు, 40 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుల్స్, 460 కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 హోంగార్డులు, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు, అదనంగా ఎన్‌సీసీ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

News December 16, 2025

​విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: సీపీ గౌస్ ఆలం

image

సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం అదే రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు తీసిన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 16, 2025

సర్పంచ్ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: సీపీ గౌస్ ఆలం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి.సైదాపూర్ 5 మండలాల పరిధిలో ​గ్రామ పంచాయతీలు 111 కాగా పోలింగ్ కేంద్రాల 1034 ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, పూర్తిగా నిషేధం అన్నారు.