News June 26, 2024
KNR: ఈ నెల 29న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.
Similar News
News December 22, 2025
KNR: ‘డ్రగ్స్ నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి’

KNR జిల్లాలో మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టేందుకు అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మెడికల్ స్టోర్లలో వైద్యుల చీటీ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థలలో అవగాహన కల్పించాలన్నారు.
News December 22, 2025
KNR: పత్తి రైతుకు మళ్లీ ‘ధర దెబ్బ’..!

కరీంనగర్ జిల్లాలో పత్తి పండించే రైతులపై మరో ఆర్థిక భారం పడింది. పత్తి నాణ్యత(పింజు పొడవు) తగ్గిందనే సాకుతో సీసీఐ మద్దతు ధరలో సోమవారం నుంచి మరో రూ.50 కోత విధించనుంది. గతనెలలో ఇప్పటికే రూ.50 తగ్గించగా, తాజాగా మరో రూ.50 తగ్గించడంతో క్వింటా పత్తి ధర రూ.8,010 కి పడిపోయింది. తమ కష్టార్జితానికి నాణ్యత పేరుతో ధర తగ్గించడంపై పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 21, 2025
ఈనెల 24 నుంచి ‘కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా’

కరీంనగర్లో ఈనెల 24 నుంచి 26 వరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ “కిసాన్ గ్రామీణ మేళా” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


