News November 5, 2024
KNR: ఉమ్మడి జిల్లా ధాన్యం కొనుగోళ్ల పరిశీలన ప్రత్యేక అధికారిగా RV కర్ణన్
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్ వి కర్ణన్ నియమితులయ్యారు. జగిత్యాల, పెద్దపెల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. రేపటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించనున్నారు.
Similar News
News December 9, 2024
వేములవాడ మాజీ MLA రమేశ్‌కు హైకోర్టు షాక్
VMWD మాజీ MLA రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వంపై రమేశ్ పిటీషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విషయమై 15.5 ఏళ్ల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించడంతో హైకోర్టు రమేశ్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, రూ.5 లక్షలు నెలరోజుల్లో కోర్టుకు చెల్లించాలని ఆదేశించింది.
News December 9, 2024
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి: KTR
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మేము గతంలో మార్కెట్ కమిటీల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాము, అలాగే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించింది BRS ప్రభుత్వామే అని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలన్నారు.
News December 9, 2024
మంత్రి పొన్నంను కలిసిన బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన ఆకుల సోనియా ఇటీవల బిగ్‌బాస్ సీజన్-8కి వెళ్లి వచ్చింది. కాగా, నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సోనియా మర్యాదపూర్వంగా కలిశారు. తన వివాహానికి హాజరుకావాలని కాబోయే భర్తతో కలిసి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు, తదితరులు ఉన్నారు.