News January 30, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికలకు 499 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు: కలెక్టర్

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి 15 జిల్లాలు, 35 డివిజన్లు, 271 మండలాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇందుకు 499 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డివిజన్లలో ఆర్డీవోలు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 274 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Similar News
News October 24, 2025
కరీంనగర్: పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ

శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 17 నుంచి LLB కోర్సులో 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రమైన ఆర్ట్స్ కళాశాలను VC యూ.ఉమేష్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం వాల్యూయేషన్ కూడా త్వరగా చేపట్టి ఫలితాలను సకాలంలో ప్రకటిస్తామని తెలిపారు.
News October 23, 2025
గన్నేరువరం PSను ఆకస్మిక తనిఖీ చేసిన CP

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గన్నేరువరం పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, ఆవరణలోని సీజ్డ్ వాహనాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించి సీసీటీఎన్ఎస్ 2.0, ఈ- సమన్లు, టీఎస్- కాప్, ఈ- సాక్ష్య తదితర సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తి పట్టు సాధించి వాటిని విధుల్లో విరివిగా వినియోగించాలని సూచించారు. FIR ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్షించి వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.
News October 23, 2025
ముగిసిన నామినేషన్ల పర్వం.. NOV 1న పోలింగ్

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈరోజు వరకు మొత్తం 73 నామినేషన్లు దాఖలయ్యాయని, రేపు పరిశీలన జరగనుందని, 25న ఉపసంహరణ జరగనుందని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. నవంబర్ 1న కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల & జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ జరగనుందని, ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.