News February 4, 2025

KNR: ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణ తదితర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ బందోబస్తు, బారీకేడ్ల ఏర్పాటుపై పోలీసు అధికారులతో చర్చించారు.

Similar News

News December 17, 2025

దోమలో లాటరీ సర్పంచ్

image

దోమ మండలం పాలేపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు 469 సమాన సంఖ్యలో ఓట్లు రావడంతో ఫలితం తేలలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ పద్ధతిని అమలు చేశారు. అధికారుల సమక్షంలో నిర్వహించిన లాటరీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన బచ్చి గారి సుజాత విజయం సాధించారు.

News December 17, 2025

డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ చేస్తే భయపడకండి: సైబర్ క్రైమ్ డీసీపీ

image

ఎన్‌టిఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘సైబర్ సురక్షా’ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న విద్యుత్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదని, వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే నమ్మవద్దని తెలిపారు. ఆన్లైన్ మోసాల బారిన పడితే వెంటనే 1930కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News December 17, 2025

రిజల్ట్స్: కూతురిపై తండ్రి.. తల్లిపై కూతురు విజయం

image

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర విజయాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం(D)లోని పెనుబల్లిలో తల్లి తేజావత్‌పై కూతురు బానోతు పాపా గెలుపొందారు. నారాయణపేటలోని కోల్పూరులో కూతురిపై తండ్రి రాములు 420 ఓట్ల తేడాతో గెలుపొందారు. సొంతింటి వారే ప్రత్యర్థులుగా మారిన ఈ పోరు చర్చనీయాంశంగా మారింది. అటు ఆదిలాబాద్‌(D) బరంపూర్‌లో 69 ఏళ్ల(ఏకగ్రీవం) తర్వాత జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి దేవరావు గెలిచారు.