News February 4, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణ తదితర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ బందోబస్తు, బారీకేడ్ల ఏర్పాటుపై పోలీసు అధికారులతో చర్చించారు.
Similar News
News February 9, 2025
మరణాల్ని పుతిన్ ఆపాలనుకుంటున్నారు: ట్రంప్

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందనేది ప్రస్తుతానికి రహస్యం. కానీ అమాయకుల ప్రాణాలు పోకుండా ఆపాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు మంచి ప్రణాళిక ఉంది. వచ్చేవారం ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అవుతా’ అని స్పష్టం చేశారు.
News February 9, 2025
వరంగల్: సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పరిపాలన పరమైన కారణాల దృష్ట్యా రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు కార్యాలయానికి రావద్దని ఆమె కోరారు.
News February 9, 2025
NLG: అంతటా రిజర్వేషన్లపైనే చర్చ..!

పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఓవైపు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తుంటే.. మరోవైపు కీలకమైన రిజర్వేషన్లపై ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందా..? అనే దానిపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.