News February 2, 2025

KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని చెప్పారు.

Similar News

News February 19, 2025

జగిత్యాల: గంజాయి సరఫరా.. ముగ్గురిపై కేసు నమోదు

image

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో దొంతాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నిశాంత్, కలువ గంగాధర్, ఎస్‌కే.ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 829 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News February 19, 2025

గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

image

భవిష్యత్ అంతా మైనింగ్ రంగందేనని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

News February 19, 2025

కరీంనగర్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

image

ఉమ్మడి KNR, ADB, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

error: Content is protected !!