News February 1, 2025

KNR: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి

image

ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించింది. ఈ నిర్ణయంతో పార్టీలో ఉత్సాహం పెరిగింది. నరేందర్ రెడ్డి మునుపు ఎన్నో సామాజిక సేవల్లో పాల్గొని, ప్రజల హృదయం గెలుచుకున్న వ్యక్తి అని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఆయన విజయంతో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారని పార్టీ సభ్యులు ఆశిస్తున్నారు.

Similar News

News December 22, 2025

2025@ విషాదాల సంవత్సరం

image

2025 భారత్‌కు మర్చిపోలేని విషాదాలను మిగిల్చింది. కరూర్ (తమిళనాడు), తిరుపతి, ఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు, ప్రయాగ్‌రాజ్ కుంభమేళాల్లో జరిగిన తొక్కిసలాటలు, గోవా క్లబ్ అగ్ని ప్రమాదం, SLBC సొరంగం కుప్పకూలిన ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. పహల్గాం ఉగ్రదాడి ఉలిక్కిపడేలా చేసి ఆపరేషన్ సిందూర్‌కు దారి తీసింది. జూన్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, వెంటనే వచ్చిన వరదలు వందల మంది ప్రాణాలు తీశాయి.

News December 22, 2025

సత్యవతి కాలేజీలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ఢిల్లీ <<>>యూనివర్సిటీలో పరిధిలోని సత్యవతి కాలేజీలో 18 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఎంఎల్ఎస్సీ, బీఎల్ఎస్సీ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, OBC, EWS, మహిళలకు రూ.800, SC, ST, PwBDలకు రూ.600. వెబ్‌సైట్: https://satyawati.du.ac.in

News December 22, 2025

ఇంట్లో ఇల్లాలు తప్పక చేయాల్సిన పనులు

image

శుభోదయం వేళ ఇల్లాలు చేసే పనులే ఆ ఇంటికి శ్రీరామరక్ష. ఉదయం నిద్రలేవగానే భారాన్ని మోస్తున్న భూదేవిని, కరదర్శనం చేసుకోవాలి. కుడివైపునకు తిరిగి లేవడం ఉత్తమం. కల్మషం ఉండని పసిపిల్లల ముఖం చూడటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇంటి ఆవరణలోని తులసి కోటను, గోమాతను దర్శించడం శుభప్రదం. స్నానమాచరించనిదే వంటింట్లోకి వెళ్లకూడదు. వంట కూడా భక్తితో చేయాలి. ఇల్లాలి ఈ నిత్యకృత్యాలు కుటుంబానికి ఎంతో మేలు చేస్తాయి.