News February 12, 2025
KNR: కాలువలో ఈతకు వెళ్లి ఒకరు మృతి, మరొకరు గల్లంతు

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
TETపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: లోకేశ్

AP: టీచర్ల వినతి మేరకు TET తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. 2010కి ముందు ఎంపికైన టీచర్లూ టెట్ పాసవ్వాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో వారు ఆవేదనలో ఉన్నారని MLCలు ఆయన దృష్టికి తీసుకురాగా ఈ విధంగా స్పందించారు. టెట్ పాస్ కాకుంటే పోస్టుకు అనర్హులనడంతో ఆందోళనకు గురవుతున్నారని నేతలు చెప్పారు. కాగా తాజా TET మాత్రం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
News October 28, 2025
నిర్మల్ కలెక్టర్ను కలిసిన నూతన ఎంపీడీవోలు

గ్రూప్ వన్ పరీక్షలో అర్హత సాధించి, ఇటీవల జిల్లాలోని నాలుగు మండలాలకు కేటాయించిన నలుగురు ఎంపీడీవోలు ఈరోజు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ను వారి తల్లిదండ్రులతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో మాట్లాడుతూ.. ఎంపీడీవో విధులు, బాధ్యతలను గురించి వివరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు.
News October 28, 2025
రేపు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు 2 రోజులుగా తరగతులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు, సిబ్బందికి సైతం మంగళవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు కూడా సెలవు ప్రకటించారు.


