News September 30, 2024
KNR: కాసేపట్లో DSC ఫలితాలు.. అభ్యర్థులు వీరే!

DSC ఫలితాలు కాసపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో SGT పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ నిష్పత్తి
KNR 1086 90 (1:12)
PDPL 549 14 (1:39)
JGTL 1248 136 (1:09)
SRCL 1043 64 (1:16)
Similar News
News October 19, 2025
కరీంనగర్‌లో 22న జాబ్ మేళా.!

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.
News October 19, 2025
KNR: వైద్యాధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్‌లో శనివారం జిల్లా వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ సమీక్షలో పాల్గొన్నారు. వైద్యాధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 18, 2025
KNR: మోటార్ వెహికల్ యాక్ట్ ఉల్లంఘనపై కొరడా

KNR కమిషనరేట్ పరిధిలో మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు CP గౌష్ ఆలం తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా చలానాలు పెండింగ్‌లో ఉన్న 301 మంది వాహనదారుల నుంచి మొత్తం రూ.64,39,715 జరిమానా వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. పెండింగ్ చలానాలు కలిగిన వాహనదారులు వాటిని తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదుచేస్తామని CP హెచ్చరించారు.