News November 17, 2024

KNR: కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి!

image

కరీంనగర్ జిల్లాలో ఈ సమయానికి ధాన్యంతో కల కళకళలాడాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా తాలు పేరిట అధిక కాంట వేయడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. రైతులు నేరుగా రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

Similar News

News December 4, 2024

డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తి చేయాలి:  సింగరేణి C&MD

image

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్ట్యా సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ C&MD బలరాం ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 120 రోజుల్లో ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలన్నారు. అన్ని ఏరియాల GMలతో ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

News December 4, 2024

పెద్దపల్లిలో సీఎం షెడ్యూల్ ఇదే

image

* గ్రూప్4 ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేత
* సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామకపత్రాలు అందజేత
* 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామకపత్రాలు అందజేత
* స్కిల్ వర్శిటీలో భాగమయ్యే సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు
* డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీఎం కప్ ప్రారంభం
* బస్ డిపో, పెద్దపల్లి-సుల్తానాబాద్ బైపాస్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
* కొత్తగా మంజూరైన పోలీస్ స్టేషన్లు ప్రారంభం

News December 4, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,54,486 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.98,703 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,520, అన్నదానం రూ.12,263,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.