News May 24, 2024
KNR: గడ్డి మందు తాగి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KNR జిల్లా వీణవంక మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కొండపాకకు చెందిన సాయి కీర్తన(17) ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకుంది. పరీక్షల అనంతరం ఇంటికి వచ్చిన కీర్తనకు కడుపునొప్పి రావడంతో భరించలేక ఈనెల 17న ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో వాంతులు చేసుకోడం గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందగా తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 19, 2025
జగిత్యాల: గంజాయి సరఫరా.. ముగ్గురిపై కేసు నమోదు

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో దొంతాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నిశాంత్, కలువ గంగాధర్, ఎస్‌కే.ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 829 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News February 19, 2025
గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

భవిష్యత్ అంతా మైనింగ్ రంగందేనని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.
News February 19, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడి KNR, ADB, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.