News April 10, 2024
KNR: గుంటకు రూ.10లక్షలు.. ఖాళీ అవుతున్న గుట్ట

KNR-JGTL జాతీయ రహదారిలోని మధురానగర్ శివారులో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న వంటశాల గుట్ట అక్రమార్కులకు వరంగా మారింది. కొందరు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవడంతో పాటు.. గుట్టను తొలచి అడుగు స్థలాన్ని చదను చేస్తున్నారు. ఇక్కడి స్థలం గుంట రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరివెనక రాజకీయ నేతల అండ ఉండటంతో పాటు అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.
Similar News
News October 27, 2025
కరీంనగర్: మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
News October 27, 2025
మొదటిసారిగా కరీంనగర్లో..!

కరీంనగర్లో మొదటిసారిగా ఏ- డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్ జరగనుంది. అలుగునూరులోని వెల్చల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ చారిత్రాత్మక పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో హైదరాబాద్ వెలుపల అధికారిక ఏ- లెవల్ లీగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచింది.
News October 27, 2025
KNR: NOV 3న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

KNR నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు KNR 1 DM విజయమాధురి తెలిపారు. NOV 3న KNR బస్టాండ్ నుంచి సా.4 గంటలకు బయలుదేరి NOV 4న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం NOV 5న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత NOV 6న సాయంత్రం వరకు బస్సు KNRకు చేరుకుంటుందని చెప్పారు. వివరాలకు 9959225920ను సంప్రదించాలన్నారు.


