News October 16, 2024
KNR: గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన రాజు, జమున దంపతులు కొడుకు, కూతురుతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నారు. చిన్నారి పాఠశాలకు వెళ్లే క్రమంలో కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి HNK తీసుకెళ్లి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.
Similar News
News July 6, 2025
KNR: ‘జూనియర్ కళాశాలల్లో నమోదు పెంచాలి’

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.
News July 6, 2025
కరీంనగర్ డీఈఓకు ఎస్జీటీయూ వినతి

DEO శ్రీరామ్ మొండయ్యకు ఈరోజు SGTU జిల్లా శాఖ పక్షాన పలు విద్యా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. త్వరలో జరగనున్న సర్దుబాటు ప్రక్రియలో SGT ఉపాధ్యాయులను PS, UPS లకే కేటాయించాలని, హై స్కూల్స్‌కు కేటాయించవద్దని కోరారు. మల్కాపూర్ PSలో తీవ్ర టీచర్ల కోరత ఉందన్నారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని, బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
News July 6, 2025
వీణవంక: గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులకు కేంద్రమంత్రి సన్మానం

వీణవంక మండలానికి చెందిన బత్తిని నరేష్ కుమార్తె బత్తిని సహశ్రీ, వేముల సరివిక, కాసర్ల లాస్య గతేడాది హైదరాబాద్‌లో ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. వారిని శనివారం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని, మెడల్‌ను అందజేశారు. చిన్నారులను ప్రశంసించారు.