News February 18, 2025

KNR: గ్రాడ్యుయేట్ ఓటర్‌కు పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల ప్రచారం

image

ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే నియోజకవర్గాలు చాలా పెద్ద పరిధి కలిగి ఉంటుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుస్తూ ప్రచారం చేయడం పెద్ద సవాలే. అయితే ఇప్పుడు అభ్యర్థులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొత్తగా పోలింగ్ వివరాలు తెలుపుతూ.. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని SMS రూపంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మీకు మెసేజ్‌లు వస్తున్నాయా కామెంట్ చేయండి.

Similar News

News October 31, 2025

Pro Kabaddi: నేడే ఫైనల్ పోరు

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 ఫైనల్ పోరులో ఇవాళ దబాంగ్ ఢిల్లీ K.C. జట్టు పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. ఢిల్లీలో రా.8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఈ 2 జట్ల మధ్య తుది సమరం జరగనుండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2021-22 సీజన్‌లో ఢిల్లీ టైటిల్‌ సాధించగా 2023-24లో పుణేరి కప్పు కొట్టింది. దీంతో ఈ 2 టీమ్‌ల్లో ఎవరు నెగ్గినా రెండోసారి టైటిల్‌ను ముద్దాడనున్నాయి.

News October 31, 2025

GNT: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తుపాన్ సమస్యలపై ఆరా

image

తుపాన్ కారణంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌ను సైతం ఉపయోగిస్తోంది. యాప్ ద్వారా సంక్షిప్త సందేశాలను ప్రజలకు పంపిస్తోంది. తుపాను కారణంగా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ సందేశాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని సత్వరమే వాటిని పరిష్కరించేందుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.

News October 31, 2025

బ్రూసెల్లోసిస్‌ వ్యాధి.. నివారణ, జాగ్రత్తలు

image

ఈ వ్యాధి నివారణకు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. పశువు ఈడ్చుకు పోయినప్పుడు దాని పిండాన్ని, మాయను, గర్భాశయ ద్రవాలు, ఇతర చెత్తను దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరంగా ఉంచాలి. పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. చికిత్స చేసేటప్పుడు వెటర్నరీ డాక్టర్లు తగిన వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలి.