News March 19, 2024
KNR: చిన్నారికి పేరు పెట్టిన KCR
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఓ చిన్నారికి మాజీ సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో.. నియోజవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష-ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రేయా ఫూలే అని పేరు పెట్టారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News September 11, 2024
ఈనెల 17న జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న మంత్రి, విప్
సెప్టెంబర్ 17న రాష్ట్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్‌లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ జారీచేశారు.
News September 11, 2024
ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రామగుండం MLA
హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కటుకు ధనుంజయ్, అరగంట కృష్ణ, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
News September 11, 2024
వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్, ఎస్పీ
వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం మెట్పల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే వాగు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వాగు ఒడ్డుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ఉత్సవాలు రాత్రివేళ ఉంటాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఉండాలన్నారు.