News March 7, 2025

KNR జిల్లాలో పగలు వేడి.. రాత్రి చలి

image

KNR జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో ఎండలు మండుతున్నప్పటికీ, రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాలో పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో 36.1℃ గరిష్ట నమోదు కాగా, శంకరపట్నం మండలం కొత్తగట్టు 13.6°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. ఈ పరిస్థితిపై మీ కామెంట్..?

Similar News

News March 10, 2025

KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

image

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.

News March 10, 2025

భారత్ విక్టరీపై కేంద్రమంత్రి బండి ట్వీట్

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమిండియా..అన్ స్టాపేబుల్, అన్ బీటేబుల్, అన్ ఫర్గటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ద మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

News March 9, 2025

కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.

error: Content is protected !!