News November 3, 2024
KNR: జిల్లా వ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం: కలెక్టర్
జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 27పై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించామన్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.
Similar News
News December 6, 2024
రాజన్నను దర్శించుకున్న 26,928 మంది భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం 26,928 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కోడె మొక్కలు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించారు.
News December 6, 2024
సిరిసిల్ల: అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన కేటీఆర్
హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు.. బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల మేరకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
News December 6, 2024
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు
KNR జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.