News January 27, 2025

KNR: టాస్క్ ఆధ్వర్యంలో ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు

image

ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులై సాప్ట్‌వేర్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువతకి టెక్నికల్ స్కిల్స్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు హాజరు కావాలనుకున్న అభ్యర్థులు ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోపు KNR IT టవర్ లోని మొదటి అంతస్తులో గల టాస్క్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 16, 2025

కాటారం సబ్ డివిజన్ అడవుల్లో పెద్దపులి!

image

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వారం రోజులుగా 15 కిలోమీటర్ల రేడియస్‌లోని అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు పులి జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

News February 16, 2025

కరీంనగర్: ‘కేసీఆర్‌కు పట్టిన గతే సీఎంకు పడుతుంది’

image

ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే  మాజీ సీఎంలు కేసీఆర్‌, కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

News February 16, 2025

కరీంనగర్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

error: Content is protected !!