News September 8, 2024

KNR: టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయి: కేంద్రమంత్రి

image

టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలు మారతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ‘గురు వందనం’ కార్యక్రమంలో పాల్గొని పలువురు ఉత్తమ టీచర్లను సన్మానించారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం మీ సమస్యలు తీరవు అన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయలు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం (TUPS) మాత్రమే అని తెలిపారు.

Similar News

News October 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి పట్టణంలో బీసీల సత్యాగ్రహ దీక్ష. @ జగిత్యాలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. @ సైదాపూర్ మండలంలో తమ్ముడి ని హత్య చేసిన అన్న. @ కోరుట్లలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని భారీ ర్యాలీ. @ సిరిసిల్లలో ముగిసిన పోలీసుల క్రీడలు. @ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ పోగాకు నివారణకు చర్యలు చేపట్టాలన్న సిరిసిల్ల కలెక్టర్.

News October 9, 2024

రోగులకు అత్యుత్తమ వైద్యసేవలను అందించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

image

సీజన్ మార్పు వల్ల ప్రబలే అంటూ వ్యాధులు, వైరల్ జ్వరాల బారిన పడిన రోగులకు అత్యుత్తమ చికిత్స అందించి, నివారణ చర్యలు చేపట్టాలని ఐటీమంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ప్రమోద్‌ను బుధవారం ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలకు దోమలు విపరీతంగా పెరిగాయన్నారు. వాటి నిర్మూలనకు యాంటీ లార్వల్ కార్యక్రమాలు ప్రతి గ్రామం, మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాలన్నారు.

News October 9, 2024

బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న కరీంనగర్!

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు కరీంనగర్ ముస్తాబైంది. మానేరు తీరం, చింతకుంట, SRR డిగ్రీ కాలేజీ, టవర్ సర్కిల్, రేకుర్తి సమ్మక్కల గద్ద అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి తీసుకొచ్చి ఏర్పాటు చేసిన మైదానాల్లో ఆడనున్నారు. రేపు బతుకమ్మ పాటలతో కరీంనగర్ హోరెత్తనుంది.